నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని అమీర్ నగర్, చౌట్ పల్లి గ్రామాల్లో కొత్త రేషన్ కార్డు మంజూరైన లబ్ధిదారులకు శనివారం సన్నబియాన్ని పంపిణీ చేశారు. చౌట్ పల్లిలో తనంగా రేషన్ కార్డులు పొందిన 293మంది లబ్ధిదారులకు, అదేవిధంగా రేషన్ కార్డుల్లో కొత్తగా నమోదైన 431 మందికి సన్న బియ్యం పంపిణీ చేసినట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రతి పేదవాడు సన్నబియ్యంతో తృప్తిగా భోజనం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.కొత్త రేషన్ కార్డులు అందించి, సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి శ్రీనివాస్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రేషన్ డీలర్ లు, తదితరులు పాల్గొన్నారు.
కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES