Wednesday, July 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదలకు సన్న బియ్యం పంపిణీ దేశానికే ఆదర్శం: మంత్రి ఉత్తమ్

పేదలకు సన్న బియ్యం పంపిణీ దేశానికే ఆదర్శం: మంత్రి ఉత్తమ్

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
పేదలకు సన్న బియ్యం పంపిణీ దేశానికి ఆదర్శమని రాష్ట్ర పౌరసరఫరాల, నీట పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కట్టంగూరు సంత ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి  పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 84శాతం ప్రజల కడుపు నింపేందుకు సన్న బియ్యం పంపిణీ చేయడం దేశ చరిత్రలో విప్లవాత్మకమని చెప్పారు రాష్ట్రంలో జరుగుతున్న సన్న బియ్యం పంపిణీ పై 11 రాష్ట్రాలకు చెందిన అధికారులు పర్యటించి పంపిణీ విధానం గురించి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. సన్న బియ్యం పంపిణీ కొరకు ఏటా పదివేల కోట్లకు పైగా ఖర్చు చేసి పేద ప్రజల ఆకలి తీరుస్తున్నామని చెప్పారు. సన్న బియ్యం పంపిణీ దేశానిమికే తలమానికంగా నిలిచిందని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని, ఇందిరమ్మ ప్రభుత్వం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించి రాష్ట్రంలో 7.95 లక్షల కుటుంబాలకు నూతనంగా రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు.

రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని రానివారు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉండగా ప్రస్తుతం 97 లక్షలకు పెరిగాయని లబ్ధిదారులు 2.80 కోట్ల నుండి 3.15 కోట్లకు పెరిగినట్లు వివరించారు. పేద ప్రజల కడుపులు నింపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. నియోజకవర్గంలో ని ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్  ను రితగతిన పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ పై నివేదిక అందించాలని పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ చౌహాన్ ను ఆదేశించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమ ప్రభుత్వం : జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే సంక్షేమ ప్రభుత్వమని పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని అన్నారు. గత ప్రభుత్వం రేషన్ కార్డుల ప్రక్రియను ఏళ్ల తరబడి నిలిపి వేసిందని దాంతో పేదలు సంక్షేమ పథకాలకు దూరమయ్యారని, తమ ప్రభుత్వం లో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించి జిల్లాలో 62,700 కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యమే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 గ్యాస్ సబ్సిడీ తో పాటు 60 వేల ఉద్యోగాలను భర్తీ ఇచ్చేసిందని పేర్కొన్నారు. మరిన్ని సంక్షేమ పథకాల అమలు చేయడం కోసం. ప్రజలు తమ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. 

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలోని ఐటిపాముల, బ్రాహ్మణ వెల్లంల ఇరిగేషన్ ప్రాజెక్టులలో భూసేకరణకు నిధులు కేటాయించాలని, భూసేకరణలో రెవెన్యూ, అటవీ భూముల సేకరణలో ఇబ్బందులు ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. మూడు జిల్లాల కలెక్టర్లు పూర్తి వివరాలతో హైదరాబాద్ కు వస్తే అన్ని శాఖలతో కలిపి సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు. అనంతరం మండలంలో మంజూరైన 1903 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, 52 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.

సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డిఎస్ చౌహన్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఆర్డిఓ యారాల అశోక్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి కోటేశ్వరరావు ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు డిప్యూటీ తహసిల్దార్ ఆల్బర్ట్ ఫ్రాంక్లిన్, కాంగ్రెస్ జిల్లా నాయకులు పూజర్ల శంబయ్య, పున్నా కైలాష్ నేత, గుత్తా మంజుల మాధవరెడ్డి, చామల శ్రీనివాస్ , మాజీ జెడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది చుక్కయ్య, రెడ్డిపల్లి సాగర్, నంద్యాల వెంకటరెడ్డి, మిట్టపల్లి శివ, ఐతగోని నారాయణ, కొండ లింగస్వామి, గద్దపాటి దానయ్య, బెజవాడ సైదులు,పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ఆర్ ఐ కుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అశోక్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -