Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బాలగణపతి ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదం వితరణ..

బాలగణపతి ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదం వితరణ..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పడంపల్లి గ్రామంలో బాల గణేష్ మండపము ఆధ్వర్యంలో గురువారం మహా అన్నదాన ప్రసాదం వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బాల గణేష్ మండలి నిర్వాహకులు మాట్లాడుతూ.. వినాయక చవితి నుండి నిరంతరంగా అన్నదానాలు వితరణ చేస్తున్నామని తెలిపారు. అన్నదానమనేది చాలా గొప్ప దానమని పెద్దలు అంటారు. బాలగణపతి నిర్వాహకులు నిత్యం దైవ పూజలో ఉంటూ గ్రామస్తులకు మార్గదర్శకంగా ఉంటున్నారు. ఈ అన్నదాన వితరణ కార్యక్రమంలో నిర్వాహకులు పంచయప్ప స్వామి, గంగ అయ్యప్ప స్వామి, శివకాంత్ స్వామి, బసవరాజ్ స్వామి, చేతన్ స్వామి, హెచ్. మహేష్ , కత్తే వార్ రాజు, ప్రశాంత్ పటేల్, బిరాధార్ విట్టల్, సిహెచ్ . ఉమాకాంత్ , లక్సెట్టి బాలాజీ, గుడ్డు నౌర్ బస్వంత్ , అశోక్, ఎల్. మనేష్ , లక్షిట్టి రాజు తదితరులు పాల్గొన్నారు. 

అదేవిధంగా బాబు జగ్జీవన్ రావ్ గణేష్ మండపం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వాహకులు మేత్రి గంగారం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గురువారం నాడు 9 రోజులు పూర్తవుతున్న సందర్భంగా శాంతియుతంగా గ్రామస్తులతో కలిసి ఊరేగింపుగా గ్రామంలోని వీధుల గుండా సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆటపాటలతో భాజ భజంత్రీలతో గణేష్ నిమజ్జన కార్యక్రమం ఊరేగింపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రావ్ గణేష్ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad