నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మోర్తాడ్ మండలం దొనకల్ గ్రామానికి చెందిన బద్దం సరితా రెడ్డి పెద్ద గ్రీన్ బోర్డులను వితరణ చేశారు. తన తండ్రి బద్దం నర్సారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన కుచుకుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థుల సౌలభ్యం కోసం పెద్ద గ్రీన్ బోర్డులను అందజేశారు. ఈ మేరకు బుధవారం పెద్ద గ్రీన్ బోర్డులను కమ్మర్ పల్లి చెందిన రేంజర్ల గంగారం, సుంకేట రవి, ప్రవీణ్, బిజీ గంగారం ద్వారా కళాశాల అధ్యాపకులకు అందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తోడ్పాటు అందించే సదుద్దేశంతో గ్రీన్ బోర్డులను వితరణ చేసిన కుచుకుల ఫౌండేషన్ చైర్మన్ బద్దం సరిత రెడ్డికి కళాశాల ఆధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మధు కుమార్, వెంకటేష్, సుమతి, వైష్ణవి, స్వాతి, గంగారం, శ్రీహరి, మురళి, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలకు గ్రీన్ర్ బోర్డుల వితరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES