- Advertisement -
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో.. ఎంపీడీఓ బి.సందీప్ కుమార్ ఎంపీవో ఉట్కూరి అంజిరెడ్డి కార్యాలయ సిబ్బందికి.. మంగళవారం హోమియో నివారణ ఔషదాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజా పరిషత్ సూపరిండెంట్ విజయకుమార్ సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -