నవతెలంగాణ – కామారెడ్డి
సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కామారెడ్డిలో సంభవించినటువంటి వరద బాధితులకు ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి సహకారంతో సహస్ర ఫౌండేషన్ చైర్మన్ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చినుకాని శివప్రసాద్ హోమియోపతి నివారణ మందులను పంపిణీ చేశారు. సుమారు 70 కుటుంబాలకు మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరద బాధితులకు సహస్ర ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ నివారణ మందులు తీసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఎటువంటి సమస్య వచ్చిన ప్రజల వద్దకు సాగర ఫౌండేషన్ వస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకాని శివప్రసాద్, చీఫ్ అడ్వైజర్ డాక్టర్ మహేష్, ఆశ ఐ ఐ హెచ్ పి స్టేట్ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ పల్సహరీష్ గౌడ్, కోఆర్డినేటర్ సీలివేరు సైదులు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోమియోపతి నివారణ మందులు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES