చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు
నవతెలంగాణ – మద్నూర్
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరాలు అంటూ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మద్నూర్ మండలంలో బుధవారం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కులను మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు మండల తహసిల్దార్ ఎండి ముజీబ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలు నిరుపేదల ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఎంతో ఆశగా వరాలుగా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ ,మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, విఠల్ గురూజీ, కొండ గంగాధర్, కొండ రాజు, మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివాజీ రాథోడ్, పెద్ద తడ్గూర్ ఈరన్న, మేనూర్ జుబ్రి సురేష్, కొడిచరా మాజీ సర్పంచ్ సంతోష్ పటేల్, నాయకులతోపాటు ఆర్ఐ శంకర్ రెవిన్యూ శాఖ సిబ్బంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES