- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని మద్దికుంటలో నూతన రేషన్ కార్డును లద్దదారులకు కాంగ్రెస్ నాయకులు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మండల ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు బండి ప్రవీణ్ మాట్లాడుతూ… బి ఆర్ ఎస్ గత పది ఏళ్ల పాలనలో ఒక రేషన్ కార్డు అందించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులo దరికి రేషన్ కార్డులు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు దుంపల బాలరాజు, నాయకులు నరసారెడ్డి, తోటలింగం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -