Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడిలో విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ 

ప్రభుత్వ బడిలో విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
మండల పరిధిలోని ఏజెన్సీ గిరిజన తండాలు మన్నె వారి పల్లి, దేవుల తండా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుబుక్కులు స్టేషనరీ పంపిణీ చేశారు. పేదరికంతో పిల్లలు చదువుకు దూరం కాకూడదని వారి తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని ఉద్దేశంతో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సభ్యులు గురు నాయక్ చందులాల్ తెలిపారు. వృద్ధులకు వికలాంగులకు కొంత ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నలుగురికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు వారు తెలిపారు. భవిష్యత్తులో సామాజిక సేవలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img