నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసన సభ్యులు జీవన్ రెడ్డి సూచన మేరకు పట్టణ భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు పూజ నరేంధర్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అమలుకాని 420 హామీలను ఇచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న ఇప్పటికీ హామీలను నెరవేర్చకుండా బాకీ పడ్డ మొత్తాన్ని ఒకే దఫాలో చెల్లించాలని అర్హులందరికీ 24 నెలల బాకీలను చెల్లించాలని లేకపోతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ దగా కోరు పాలన విధానంతో రాష్ట్రం అధోగతి పాలవుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్వసమాజ్ అధ్యక్షులు సుంకరి రవి,మాజీ పి ఎ సి ఎస్ ఛైర్మెన్ ఇగ గంగాధర్, వైస్ చైర్మన్ నర్మే నవీన్, యువజన అధ్యక్షులు గుంజల పృద్వి రాజ్, అగ్గు క్రాంతి , ఎస్ సి సెల్ టౌన్ అధ్యక్షులు జన్నాపల్లి రంజిత్ సీనియర్ నాయకులు మీరా శ్రవణ్, ఇందూర్ విజయ్,మైనార్టీ నాయకులు అర్షద్, లతీఫ్, రహ్మద్ భాయ్, శైఫ్, చరణ్, ప్రితం, శైఫ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాకీ కార్డుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES