Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లకు పట్టాలు పంపిణీ..

ఇందిరమ్మ ఇండ్లకు పట్టాలు పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గ పెద్దవూరమండలం నాయిన వానికుంట, నాయిన వానికుంట తండాలో మంగళవారం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల శ్రీకాంత్  ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్బంగా  శ్రీకాంత్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నెరవేరుతుందని,  సన్న బియ్యం పంపిణి, రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు సౌకర్యం 200 యూనిట్ల విద్యుత్తు వంటి అభివృద్ధి పనులు చెప్పట్టిందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిందని తెలిపారు.

త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని అధిక మెజారిటీ స్థానాలు గెలుపొందుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుకు ప్రతి ఒక్కరికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దవూర పీఏసీఎస్ చైర్మన్ గుంటుక వెంకట్ రెడ్డి,  కాంగ్రెస్ నాయకులు రాఘవరెడ్డి,బొల్లిగొల్ల లింగయ్య, చిమట వెంకటేశ్వర్లు, కొట్టే మల్లేష్,మేకల శివశంకర్,జనపాటి సతీష్,రాజారాం నాయక్, కొట్టే వెంకటయ్య, కొట్టే శంకరయ్య, చందు నాయక్, మేకల నాగరాజు,పులి రవి, రమేష్ నాయక్, కొట్టే సాయికుమార్,మేకల లింగయ్య, వినోద్ నాయక్,పులి రామారావు,లకుపతి, శ్రీను, ఎన్ఎస్ యూ ఐ  నాయకులు తదుపరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -