Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్‌ల పంపిణీ

ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్‌ల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలేరు మండలంలోని శారాజిపేట గ్రామంలో శాసనసభ్యులు ఐలయ్య  మరియు బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బిర్ల అనిత  సహకారంతో ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ తోఫా కిట్‌లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కంతి మధు మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులకు తోడ్పాటు అందించడం ఆనందంగా ఉందన్నారు.అన్ని మతాల మధ్య సౌహార్దం పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దూడల శ్రీధర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు చిలుకు నాగరాజు,మదర్ డైరీ చైర్మన్ బత్తుల నరేందర్ రెడ్డి,వార్డు సభ్యురాలు సుమలత సంతోష్ గౌడ్,మొరిగాడి శ్రీను, దూడల చంద్రశేఖర్,పుట్టల మహేందర్, నారు మల్లయ్య, పెండ్యాల సత్యనారాయణ, గండికోట సంతోష్, మొరిగాడి శ్రీనివాస్, శివశంకర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -