Tuesday, August 5, 2025
E-PAPER
Homeకరీంనగర్రేపటి నుండి రేషన్ కార్డుల పంపిణీ..

రేపటి నుండి రేషన్ కార్డుల పంపిణీ..

- Advertisement -

మండల వ్యాప్తంగా 3058 మంది లబ్దిదారులకు కొత్తకార్డులు జారీ
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. ఇదివరకే జిల్లాలో పలు మండలాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కాగా తంగళ్ళపల్లి మండలంలో మంజూరు చేసిన కొత్త కార్డులను పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే బుదవారం మండలం లోని బద్దెన పల్లి ఎస్ ఎస్ గార్డెన్లో 3058కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. మండలంలోని అన్ని గ్రామాల కు చెందిన లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు. కొత్త కార్డులను పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పదేండ్లుగా ఎదురు చూస్తున్న నిరుపేదల్లో హర్షం వక్తమవుతోంది.

మండలంలో  కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పదేండ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కార్డులు వస్తున్నాయని తెలవడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేషన్కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమంతో పాటు ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకున్నారు. చనిపోయిన వారి ‘పేరు తొలగించడంతో పాటు పెండ్లి చేసుకున్న వారి పేర్లను కార్డులో తొలగింపు ప్రక్రియ కొనసాగింది. జన్మించిన వారి పేర్లు మాత్రం జోడించే అవకాశం కల్పించలేదు. దీంతో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూర్యాపేట జిల్లాలో రేషన్కార్డుల పంపిణీ ప్రారంభించడంతో అన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో  జిల్లాలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కోర సరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పలుచోట్ల ఇదివరకే రేషన్ కార్డుల పంపిణీ అధికారికంగా ప్రారంభించారు. తంగళ్ళపల్లి మండలానికి మంజూరైన 3058 కొత్త కార్డులను అధికార పార్టీ నాయకులు నియోజకవర్గం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆర్డీవో, తహసిల్దార్ గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

 సవరణకు వచ్చిన దరఖాసులు 

తంగళ్ళపల్లి మండల వ్యాప్తంగా  రేషన్ కార్డుల లో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు 2507దరఖాస్తులు రాగా 2413 అధికారులు ఆమోదించారు. నూతన రేషన్ కార్డుల కోసం 1661 దరఖాస్తులు రాగా అధికారులు 1539 దరఖాస్తులను ఆమోదించారు. అందులో ఇప్పటి వరకు మిగిలిన దరఖాస్తులను రెవెన్యూ శాఖ పరిశీలనలో ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. 

కార్డుల పంపిణీ..

పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి, ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు రావడంతో  తంగళ్ళపల్లి మండలంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ నేటి నుండి ప్రారంభించనున్నారు. దీంతో ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. కొత్తగా కార్డులు మంజూరైన వారికి సెప్టెంబర్ నెల నుంచి బియ్యం అందజేస్తారని అధికారులు తెలుపుతున్నారు.

మండల వ్యాప్తంగా నూతనంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న నూతన రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అందించే కార్డులు 1397 కాగా, కొంతమంది లబ్ధిదారులు కార్డుల నుండి పేర్లు తొలగిపోగా, కొంతమంది పేర్లను నమోదు చేయగా 2224 రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఆందోళన చెందొద్దు: జయంత్ కుమార్ తహశీల్దార్ తంగళ్ళపల్లి

రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమకు రాలేదని ఆందోళన చెందే అవసరం లేదు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రతి నెల లబ్దిదారుల ఎంపిక, వెరిఫికేషన్ కొనసాగుతుంది. కొంత మంది తమకు రాదేమోనని మధ్యవర్తులను సంప్రదించి మోసపోతున్నారని తెలిసింది. ఎవరినీ నమ్మొద్దు, ఆఫీసుల చుట్టూ తిరగొద్దు. మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఆన్ లైన్ లో ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -