Wednesday, July 16, 2025
E-PAPER
Homeఆదిలాబాద్మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ..

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్: మహిళల ఆర్థిక తోడ్పాటు అందించిందికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నారని ఎంపీ గోడం నాగేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో ఓఎన్జీసి ద్వారా మండల మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. ఇందులో భాగంగా మండలంలోని 18 గ్రామాలకు చెందిన కుట్టు మిషన్ శిక్షణ పొందిన వారికి 270 కుట్టుమిషన్లను ఓఎన్జీసి సంస్థ సభ్యులు మృత్యుంజయతో కలసి ఎంపీ గోడం నాగేష్ చేతులమీదుగా మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపి గోడం నాగేష్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలకు ఆర్థిక స్వావలంబన పొందుటకు వారికి తోడ్పాటు అందించడానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కుట్టుమిషన్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.

అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఎంపీ గోడం నాగేష్ ట్యాబ్ లు పంపించేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా సంకేతిక విద్యను నేర్పించుటకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటి పెళ్లి రాజు, స్థానిక బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్, నాయకులు ఆల్క గణేష్, నానం రమణ, కొత్త శంకర్, వామన్ గిట్టే, మురళీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -