నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
మండలంలోని అంక్సాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1999… 2000 పదవ తరగతి పూర్వ విద్యార్థులు, విద్యార్థిని విద్యార్థుల కోసం 40 స్పోర్ట్స్ డ్రెస్సులు ( 12 వేల రూపాయలు) వితరణ చేసినట్టు ప్రధానోపాధ్యాయులు మల్లీశ్వరి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులు అపర్ణ సుమలత సునీత వసంత యమునా మిగతా విద్యార్థుల బృందం మాట్లాడుతూ.. పాఠశాలకు స్పోర్ట్స్ డ్రెస్సులు ఇవ్వడం తమకు ఎంతగానో ఆనందంగా ఉందని తెలిపారు మునుముందు పాఠశాలకు కావలసిన అవసరాలను తీరుస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పాఠశాలలో చదివి తాము ప్రయోజకులై ఈ పాఠశాలకు తమ వంతు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల హెచ్ఎం ఆర్ మల్లీశ్వరి ఉపాధ్యాయ బృందం పూర్వ విద్యార్థులను అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం రవిచందర్ రఘునాథ్ సునీత రాజేంద్ర కాంతయ్య యమునా శ్రీదేవి శ్రీలక్ష్మి దేవరాజ్ సదాశివ్ వినోద్ వేణుగోపాల్ రెడ్డి జాన్సన్ రాజు , పాఠశాల పిడి దేవ సుకన్య, సిఆర్పి మూర్తి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
అంక్సాపూర్ ఉన్నత పాఠశాలకు స్పోర్ట్స్ డ్రెస్ ల వితరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES