Thursday, January 8, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన  ముధోల్ లోని ప్రభుత్వ, కేజీబీవీ, మైనారిటీ పాఠశాలలో తో పాటు, ప్రైవేట్ పాఠశాలలు రబింద్ర హై స్కూల్, శిశుమందిర్ స్కూల్ లో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను మంగళవారం పంపిణీ చేశారు.  సుమారు 670 పదవ తరగతి విద్యార్థులకు స్టడీమెటీరియల్ ను చైర్మన్  మోహన్ రావు పటేల్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.

పేద, మధ్య తరగతి విద్యారుతులకు మా వంతు చేయూత గా ప్రజా ట్రస్ట్ ద్వారా అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు కష్ట పడి ఉన్నత స్థానానికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిపి సుభాష్ పటేల్, న్యాయవాది సోమేశ్, నాయకులు ధర్మపురి సుదర్శన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు,తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -