- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన కలువల నాగరాజు అనే యువ రైతు పిడుగుపాటుతో ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే అతని 10వ తరగతి బ్యాచ్ మిత్రబృందం నాగరాజు జ్ఞాపకార్థం మల్లారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సోమవారం నోట్ పుస్తకాలు, జామెంట్రీ బాక్సులు,పరీక్ష ప్యాడ్స్,పెన్నులు తదితర స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నాగరాజు మిత్రబృందం,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -