Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా స్థాయి బాలికల కబడ్డీ జూనియర్, సీనియర్ సెలెక్షన్స్

జిల్లా స్థాయి బాలికల కబడ్డీ జూనియర్, సీనియర్ సెలెక్షన్స్

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట బుధవారం, ఆదర్శ యువజన మండలి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి బాలికల కబడ్డీ జూనియర్, సీనియర్ సెలెక్షన్స్ నిర్వహించారు. ఈ పోటీల్లో జూనియర్ విభాగం నుండి 14, సీనియర్ విభాగం నుండి మరో 14 మంది క్రీడాకారిణులు రాష్ట్రస్థాయికి సెలక్టు అయ్యారు. సెలెక్ట్ అయిన క్రీడాకారిణులు డిసెంబర్ లో జరిగే జూనియర్, సీనియర్ బాలికల కబడ్డీ, రాష్ట్ర స్థాయి క్రీడలలో యాదాద్రి భువనగిరి జిల్లా తరుపున పాల్గొంటారు.

ఈ కార్యక్రమంలో అతిధి డివైఎస్ఓ ధనుంజయ్, జిల్లా కబడ్డీ అధ్యక్షులు గొంగిడి మహేంద్రరెడ్డి, హై స్కూల్ హెచ్ ఎం మల్లికార్జున్, జిల్లా కబడ్డీ అసోసియేషన్, అధ్యక్షులు పూల నాగయ్య, కోశాధికారి గంధమల్ల కుమార్, పి యి టి లు విజయ్, సురేందర్, చంద్రకుమార్, మనోహర్, రాము, శేఖర్, ఆదర్శ యువజన మండలి కార్యవర్గం, అధ్యక్షులు కటకం శ్రీనివాస్, కన్వీనర్ ఇరిటెపు శ్రీనివాస్, పాండు, కుమార్, సురేష్, భాస్కర్, యాదగిరి, బాలసిద్ధులు, సైదులు, బోలు, మహేందర్, రాజు, ప్రవీణ్, మల్లేష్, అశోక్, బాబు, సభ్యులు, యువకులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -