Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యానవన, పట్టు పరిశ్రమల పంటలను పరిశీలించిన జిల్లాధికారిని

ఉద్యానవన, పట్టు పరిశ్రమల పంటలను పరిశీలించిన జిల్లాధికారిని

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాలలోని గ్రామాలలో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారిని జ్యోతి శుక్రవారం పలు రకాలైన ఉద్యానవన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారిని జ్యోతి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని జుక్కల్ మండలంలోని నాగల్ గావ్, పడం పల్లి ఉద్యాన శాఖ అధికారులు కూరగాయలు పండిస్తున్న రైతులకు రాయితీపై నారు ఇచ్చామని అన్నారు. అలాగే రైతులు వ్యక్తిగతంగా తమ సొంత ఖర్చులతో కూరగాయలు పండిస్తున్న వారికి ఎకరాకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రూ.8 వేలను రైతులకు అందిస్తామని తెలిపారు. పండ్ల తోటలైన పొప్పాయ , మామిడి ,జామ, అరటి పండ్ల రకాల పంటలకు రాయితీ అందిస్తామని తెలిపారు. పెద్ద రైతులకు పండ్ల తోట ప్యాక్ హౌస్ లో నిర్వహించే రైతులకు రెండు లక్షల 40 వేల రాయితీపైనా అందిస్తామన్నారు.

ఉద్యానవన పంటలకు వేసుకుని రైతులకు వేసుకునే పెద్ద రైతులకు వేసుకుని పెద్ద రైతులకు డ్రిప్ పరికరాలు రాయితీ ఇస్తామన్నారు. పెద్ద రైతులకు 80 శాతం, చిన్న రైతులకు 90 శాతం, ఎస్సీ ఎస్టీ రైతులకు 100% రాయితీ ఇస్తామని తెలలియజేశారు. ఆయిల్ ఫామ్  వేసుకుని రైతులకు ప్రోత్సాహకరం ఉండేందుకు రాయితీపై డ్రిప్పు మరియు నాలుగు సంవత్సరాల పాటు ఎకరాకు 4వేల 2 వందలు అందజేస్తామన్నారు. జుక్కల్ నియోజకవర్గం హార్టికల్చర్ అధికారిని రామకృష్ణను కలవాలని, కావలసిన వివరాలను తీసుకోవాలని, ప్రతి ఒక్క రైతులు ఈ సద అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

సాంప్రదాయ పంటలైన వరి, ఇతర పంటలు పండిస్తున్న రైతులు ఉద్యాన పంటలపైన అవగాహన చేసుకొని ఆదాయం పెంచుకోవాలని సూచించారు. ఉదాహరణకు ఆయిల్ ఫామ్ పెంపకం చేస్తున్న రైతులు ఎకరాకు ఒక లక్ష యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నారని, అదేవిధంగా ఇతర రైతులు కూడా తమ ఆదాయం పెంచుకోవాలని సూచించారు. ఈ ఉద్యానవన పంటల పరిశీలన కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ అధికారిని,  నియోజకవర్గం అధికారి రామకృష్ణ , నాగల్ గావ్ సర్పంచ్  జాదవ్ సునంద బాబు పటేల్ , పడంపల్లి సర్పంచ్ వాగ్మారే విజయ కుమారి సంజీవ్, ఉప సర్పంచ్ పావుడే సవిత, రైతులు పద్మశాలి వీరేశం, లక్షెట్టి ఉమాకాంత్, పావుడే సురేష్, జంగం సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -