నవతెలంగాణ – కన్నాయిగూడెం
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఆదేశాల మేరకుజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు ,కన్నాయి గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించినారు. కన్నాయి గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పనిచేసే ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి డిఎం , హెచ్ ఓ మాట్లాడుతూ, సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలని, లేనియెడల సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకోబడతాయని సిబ్బందిని హెచ్చరించారు.
ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగులకు డ్యూటీ రోస్టర్ వేసి దాని ప్రకారంగా ప్రతి ఒక్క ఉద్యోగి విధినిర్వహణ నిర్వహించాలని, రికార్డులను రిజిస్టర్ లను పరిశీలించి పెర్ఫార్మన్స్ పనితీరును మెరుగుపరుచుకోవాలని అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను 100% చేయాలని తెలిపారు. సమావేశ అనంతరం ఆరోగ్య కేంద్రంలోని మందుల గదిని ఇన్ పేషెంట్ వార్డులను సందర్శించి వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి అడిగి తెలుసుకుని, ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ శ్రీకాంత్ కన్నయ్య గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మధుకర్, డాక్టర్ గిరిబాబు, హెల్త్ ఎడ్యుకేటర్ సుజాత సూపర్వైజర్ రమణకుమారి మరియు కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మేల్ అండ్ ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్ పాల్గొన్నారు.



