- Advertisement -
- – ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ - ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. అత్యవసరమైతే తన అనుమతి తీసుకుని, తమ కింది స్థాయి అధికారిని ప్రజావాణికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు.
సోమవారం ఐ.డీ.ఓ.సీలో అదనపు కలెక్టర్ లు అంకిత్, కిరణ్ కుమార్ లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 74 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కాకూడదని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్ రావు, మెప్మా పీ.డీ రాజేందర్, ఏ.సీ.పీ రాజా వెంకట్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -