Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదు

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదు

- Advertisement -

పంతకాని తిరుమల సమ్మయ్య 
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ 
నవతెలంగాణ – కాటారం

వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా సెంటర్ల వద్ద సౌకర్యాలు కల్పించడం జరిగిందని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తిరుమల సమ్మయ్య అన్నారు. సోమవారం దామెరకుంట, మల్లారం పీఏసీఎస్ సెంటర్ ను సందర్శించి రైతుల సమస్యలను గూర్చి వాకాబు చేశారు. కాంటా విషయంలో మిల్లర్లు కటింగ్ పెడితే సహించేది లేదని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదన్నారు. సన్నధాన్యానికి ప్రభుత్వం బోనస్ అందిస్తుందని, రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చైర్ పర్సన్ తిరుమల సమ్మయ్య రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో  మాజీ యం పీ పీ పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంభం రమేష్ రెడ్డి ,దేవదాసు, మహేష్, సురేందర్ తదితరులు వారితో పాటు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -