రాముడు, అయోధ్యలో రామాలయ నిర్మాణ ఉద్యమం బీజేపీకి అత్యధిక ప్రయోజనం చేకూర్చాయి. సమకాలీన భారత రాజకీయ చరిత్రలో బీజేపీకి రాజకీయంగా ఆధిపత్య స్థానంలో ప్రతిష్టించాయి. రాముడిని ఎందరో ఆరాధిస్తారు. ఆయనను దివ్య లక్షణ సమన్వితుడుగా పరిగణిస్తారు. తులసీదాసు ‘రామచరిత మానస్’ ప్రభావంతో వందలఏళ్లుగా హిందూ కుటుంబాలలో హత్తుకుపోయిన పురాణాలలో భాగమది. రెండు భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం వర్ణిస్తున్నట్టుగా రాముడిని మర్యాద పురుషోత్తముడు గా దైవారాధన చేయడంపట్ల మనకు ఎలాంటి పేచీ వుండజాలదు. కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత విశ్వాసాలు, నమ్మకాలతో ఎవరూ వివాదాలు పెట్టుకోరు.
అయితే సరే విశ్వాసాన్ని రాజకీయాలతో పాలనతో కలగా పులగం చేసినప్పుడే అసలు సమస్య ప్రారంభ మవుతుంది. నూతనంగా నిర్మించిన రామ మందిరంలో నవంబరు 25న జరిగిన కార్యక్రమంలో ఈ ప్రక్రియనే మరిం త భద్రం చేసుకోవడానికే మరిన్ని అస్త్రాలు ప్రయోగించబడ్డాయి. ఆలయ శిఖరంపై ధర్మధ్వజం ప్రతిష్టాపన జరిపిన కార్యక్రమం దేశ గతం వర్తమానం భవిష్యత్తుకు సంకేతంగా ప్రదర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి పదకొండేళ్లు గడచిపోయాయి. ఇతర ఎన్నికల ప్రక్రియల ద్వారా కూడా బీజేపీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలనూ, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పార్లమెంటు ఎన్నికల కమిషన్ వంటి వివిధ రాజ్యాంగ వ్యవస్థలను, న్యాయ నిర్ణయ ప్రక్రియలోని కీలకమైన అంశాలను కూడా పట్టులోకి తెచ్చుకోగలిగింది. తద్వారా భారత జాతీయత ప్రాధాన్యతనే తిరగరాయడానికి అది వీటిని ఉపయోగించడానికి సిద్ధమైంది.
ధర్మధ్వజ సంకీర్తన
ధర్మధ్వజ ప్రతిష్టాపనోత్సవంలో ప్రధానమంత్రి మోడీ, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌ల ప్రసంగాలను గనక పరీక్షగా చూస్తే స్వాతంత్య్ర పోరాటంతో సహా మన గతం మొత్తాన్ని రామకథలో భాగం చేసేందుకు పనిగట్టుకుని ప్రయత్నం చేసినట్టు స్పష్టమతుంది. మోడీ ఇలా ప్రవచించారు: ఈ రోజున రామ ప్రభువు జన్మభూమి అనంత శక్తి, శ్రీరామ కటుంబ దివ్యఖ్యాతి…ఈ పుణ్య మందిరంలో మహత్తర ఆలయం లో ధర్మధ్వజ రూపంలో వ్యవ స్థాపితమయ్యాయి….ఈ ధర్మధ్వజం కేవలం ఒక పతాకం కాదు. భారతీయ నాగరికతకు ఇదో పునర్వై భవం. సూర్య వంశ ప్రతిష్ట లిఖించబడిన ఈ కాషాయపతాక, దానిపై ప్రకాశిస్తున్న దేవకాంచన వృక్షం రామరాజ్య ఖ్యాతిని చాటుతాయి. ఈ పతాకం ఒక సంకల్పం. ఈ పతాకం ఒక విజయం. పోరాటంతో సృష్టించుకున్న కథే ఈ పతాకం.”
ఒక దేశంగా ఇండియా అస్తిత్వాన్ని రాముడి దివ్యత్వంతో సంలీనం చేయడమే ఇక్కడ ఉద్దేమన్నది స్పష్టం.
భారత ప్రజల వైవిధ్యత, బ్రిటిష్ వలసాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటంలో రూపుదాల్చిన వారి సమైక్యత ఇవన్నీ అప్రధానంగా కొట్టివేయ బడుతున్నాయి. మంచి జీవితం కోసం, తిండి బట్ట గూడు వంటి కనీసావసరాలు పొందడం కోసం విద్య, వైద్యం వంటి అత్యవసరాల కోసం ప్రపంచ దేశాల సముదాయంలో నిలదొక్కుకునే స్థానం కోసం వారు చేసే పోరాటం అన్నీ ఆ దేవారాధన, దివ్యత్వం ముందు ప్రాధాన్యత లేనివైపోతున్నాయి. మనం ఈ మొత్తం వివా దాన్ని తదనంతర చర్చను ఏడాది వెనక్కు వెళ్లి చూడాలి. ఆ సమయంలో అక్కడ ఆలయ ప్రారంభోత్సవం జరిగిన ప్పుడు కొందరు శంకరాచార్యులు ప్రదానమంత్రి మొత్తంలో కీలక పాత్ర ధరించడం పట్ట రాజకీయాలు మతం స్థానాన్ని ఆక్రమించడం పట్ల అభ్యంతరాలు లేవనెత్తారు.
మతం రాజకీయం వేర్వేరు
భారతదేశంలోనూ, ఇతర చోట్ల కూడా మతం రాజకీయాలు ఆమడ దూరం పాటిస్తాయి. ప్రజల కొరకు, ప్రజల యొక్క, ప్రజల చేత అన్న సూత్రంపై ప్రజాస్వామ్యాలు ప్రవర్ధిల్లుతాయి. దివ్యత్వం గురించిన మొత్తం చర్చలోకి దిగనక్కరలేదు గానీ దేశంలో చాలా నమ్మకాలు విశ్వాసాలు వున్నాయి. వాటన్నిటికీ సంబంధించి దైవత్వం ప్రజా పరి పాలన రెండూ పరస్పర అనుబంధితాలుగా చూపే ఈ ప్రేమాతిశయం ఇదేస్థాయిలో వుండకపోవచ్చు. వర్గం, కులం, తెగ, మతం తదితరాలతో నిమిత్తం లేకుండా రాజకీయ పార్టీలు ప్రజల మేలు కోసం నిర్దిష్టంగా విధాన నిర్దేశాలు, నిర్దుష్ట చర్యలు ప్రతిపాదించవలసి వుంటుంది. జవాబుదారీ సూత్రం ప్రకారం వాటి అమలుకు బాధ్యత వహిం చవలసి వుంటుంది. విధానాల అమలు ఫలితాలను బట్టి ప్రభుత్వాలను ఆ విధంగా అంచనా వేయడం జరుగుతుంది.
ఏమైనా అయోధ్యలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం తీరుతెన్నులు అలాంటి పరీక్షకు నిలవడం ఎంతమాత్రం ప్రధానం కానట్టు కనిపిస్తుంది. ఆయన సూటిగా ఇలా చెప్పేశారు: ఈ దర్మధ్వజం మన సంకల్పానికి ప్రతీక…నహీ దరిద్ర, కోయి దు:ఖీ న దీన..అంటే మనం దరిద్రం, దు:ఖం దీనత్వం లేని సమాజం నిర్మిస్తాం..” మరి దరిద్రం, దు:ఖం, అసహాయతలను శాశ్వతంగా లేకుండా చేసేందుకు ఏం చేస్తారో చెప్పవలసిన బాధ్యత ప్రధానమంత్రిపై వుం టుంది. రామప్రభువును ధర్మధ్వజాన్ని మొత్తంగా కీర్తించి నంత మాత్రాన ఇది సాధించేసినట్టు కాదు కదా.. ఒకవైపున అసమానతలు, పేదరికం, నిరుద్యోగం ఇంకా ఇంకా పెరిగిపోతుంటే ఆ లక్ష్యాన్ని సాధించే మార్గమేమిటో చెప్పాలి.
ఆరెస్సెస్ అసలు పాచిక
వలసవాద యుగంలో 1835లో థామస్ మెకాలే ఇంగ్లీషును బోధనా భాషగా ప్రవేశ పెట్టడాన్ని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. మెకాలే తీసుకొచ్చిన వలసవాద విద్యా విధానం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రయో జనాల కోణంలో పుట్టిందే. అది లేకుండా చేయాలంటే బ్రిటిష్‌వారిని ఓడించాలి, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ ధర్మధ్వజంపై మరింత కపటంగా మాట్లాడారు. ”చారిత్రికంగా భావోద్వేగపరంగా ఆధ్యాత్మికంగా అత్యంత కీలక ఘట్టం’గా అభివర్ణించారు. బిజెపికి ప్రత్యేకించి సంఫ్‌ుకు స్వయం ప్రకటిత ప్రచారకుడైన ప్రధాని మోడీకి చోదక శక్తిగా వున్నదే ఆరెస్సెస్ సంస్థ. మరి బ్రిటిష్‌వారిపై పోరాటానికీ, వారిని ఓడించడానికీ, పురోగమన శీలమైన, దారిద్య్రం దు:ఖం, అసహాయతలు లేని స్వతంత్ర భారత్‌ను నిర్మించడానికి ఆరెస్సెస్ ఏ విధంగా దోహడపడిందో కూడా మోహన్ భగవత్ చెప్పాలి.
వాస్తవానికి ఇటీవల ఒక సందర్భంలో మోహన్ భగవత్ గాంధీజీ హింద్ స్వరాజ్‌లో చేసిన వ్యాఖ్యలపై విరచుకుపడ్డారు. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభ సమయంలో చేసిన ఆ రచనలో గాంధీజీ హిందూ ముస్లిం మధ్య శాశ్వత శత్రుత్వమేమీ లేదని, బ్రిటిష్ పాలకులు ఆ విధమైన పరిస్థితి కావాలని సృష్టించారని గాంధీజీ పేర్కొన్నారు. అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రెండు మతాల మధ్య ఐక్యత పెరిగింది. స్వాతంత్ర పోరా టంలో, స్వాతంత్య్ర సాధనలో స్థానం లేకపోవడం శతవార్షికోత్సవం జరుపుకొంటున్న ఆరెస్సెస్‌కు ఒక సంకట పరిస్థితి. కనుక భారతదేశం 1947 ఆగష్టు 15న స్వాతంత్ర సాధించలేదనీ, రామమందిర ప్రారంభోత్సవంతోనే స్వాతంత్య్రం సిద్ధించందనీ ఒక కట్టుకథ సృష్టించేందుకు ఆరెస్సెస్ నానా తంటాలు పడుతున్నది. అలా జరగాలంటే వాస్తవాన్ని దివ్యమహత్యాలతో కప్పేయాలి.
జీవన్మరణ సమస్య
వాస్తవ ప్రపంచంతో పోరాడటం భారతదేశ ప్రజానీకానికి జీవన్మరణ సమస్య. ఎందుకంటే కార్పొరేట్ కుమ్మక్కు, తత్ఫలితంగా పెరిగిన అవినీతి దేశ మూలాలను తొలిచేస్తున్నాయి. రెండు పూటలా తిండికి నోచని కోట్లాది మంది రైతులూ వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికి జరిగే పోరాటం అది. వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతుంటే సార్వత్రిక ప్రాథమిక విద్య లక్ష్యాలను సాధించడానికి జరిపే పోరాటం. మన యువతీ యువకులు పని హక్కుతో జీవనోపాధి పొంది తమ కుటుంబాలకూ దేశానికి శ్రేయస్సు కలిగించే సానుకూల పాత్ర నిర్వహించేందుకు అవకాశం కల్పించే పోరాటం అది. మన దేశ జాతీయత నిర్వచనాన్ని తిరగదోడటం ఆరెస్సెస్ పథకం. దైవత్వానికి కృత్రిమమైన విధేయతను చాటడం ద్వారా మన దైనందిన పాదార్థిక వేదనలను ఎలాగో కప్పిపుచ్చి పారవశ్యంలో ముంచెత్తే పథకం దానిది. ఇలా చెప్పడమంటే నిజమైన ప్రపంచాన్ని గుర్తించడమే తప్ప ఏదో అగౌరవం చూపడం కాదు. ఆ పోరాటానికి మనను మనం పునరంకితం చేసుకోవాలి.
(డిసెంబర్ 3 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
అయోధ్యలో మళ్లీ ‘దివ్య’ రాజకీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



