Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్లీచింగ్  పౌడర్ అందజేసిన దివిస్ లాబరేటరీస్..

బ్లీచింగ్  పౌడర్ అందజేసిన దివిస్ లాబరేటరీస్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రోజు దీవిస్ లెబోరేటరిస్ లిమిటెడ్” వారు రూ.4,65,000/- విలువగల 685 బ్లీచింగ్ పౌడర్, 685 సున్నం బస్తాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ భువనగిరి జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం పనులకు గాను  దివిస్ సంస్థ  ఎల్లప్పుడు కృషి చేస్తుందని అన్నారు. గ్రామాలలోని మురికి కాలువలో నీరు నిల్వ ఉండే ప్రదేశాల బ్లీచింగ్  చల్లడం వలన దోమలను అరికట్టవచ్చునారు.  గ్రామపంచాయతీ అధికారులందరూ ప్రతి గ్రామపంచాయతీలో  బ్లీచింగ్ బ్యాగులును  తీసుకొని సద్వినియోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఇంచార్జి విష్ణువర్ధన్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్ ప్రసాద్, డి ఎల్ పి ఓ  శ్రీకాంత్ రెడ్డి,  దివిస్(ప్రతినిధి లైజన్ ఆఫీసర్ బి కిషోర్ కుమార్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -