Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeఆటలుక్వార్టర్స్‌లో దివ్య దేశ్‌ముఖ్‌

క్వార్టర్స్‌లో దివ్య దేశ్‌ముఖ్‌

- Advertisement -

మహిళల స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌
న్యూఢిల్లీ :
ఫిడె మహిళల వరల్డ్‌కప్‌ చాంపియన్‌, నయా గ్రాండ్‌మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ (19) 2025 మహిళల స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ఫిడె ప్రపంచకప్‌ తర్వాత తొలిసారి ఎత్తులు వేసిన దివ్య దేశ్‌ముఖ్‌.. ప్రీ క్వార్టర్‌ఫైనల్లో చైనా గ్రాండ్‌మాస్టర్‌ లీ టింజీపై 10-3తో విజయం సాధించింది. మూడు సెగ్మెంట్లలో సాగిన పోటీలో చైనా స్టార్‌ను ఓడించిన దివ్య దేశ్‌ముఖ్‌ సెమీఫైనల్లో చోటు కోసం మూడు సార్లు ప్రపంచకప్‌ విజేత, చైనా జీఎం హో యిఫెన్‌తో తలపడనుం ది. భారత మరో గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌ వైశాలి క్వార్టర్స్‌ ముంగిట బోల్తా పడింది. అమెరికా ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ ఎలీస్‌ లీ చేతిలో 6-8తో వైశాలి పరాజయం పాలైంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad