- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
గణేష్ నిమజ్జన సమయంలో డిజెలకు అనుమతి లేదని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. గణేష్ నిమజ్జనాన్ని ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా శాంతియుతంగా నిర్వహించాలని డిజె సౌండ్ లు పెట్టకుండా పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -