- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బెళగావిలో కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ మరోసారి ముఖ్యమంత్రి మార్పు అంశం తెరమీదకు వచ్చింది. రామనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడిన మాటలు తీవ్ర చర్చనీయాంశమైంది. “నేను మీకు ఒక శుభవార్త తెలియజేస్తున్నాను. ఈ సమావేశాల అనంతరం శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం శివకుమార్ చేసిన పోరాటం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి ఆయనను సీఎం స్థానంలో కూర్చోబెడతాయని ఇక్బాల్ హుస్సేన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
- Advertisement -



