మిత్రపక్షాలకు 70 స్థానాలు
కాంగ్రెస్‌కు 28.. సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలకు చెరో 5 సీట్లు
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం అధికార డీఎంకే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకు గాను 164 స్థానాల్లో డీఎంకే పోటీ చేయనున్నది. మిగతా 70 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె స్టాలిన్ ప్రకటన చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌కు 28 సీట్లు, డీఎండీకేకు 10, వీసీకేకు 8 స్థానాలు, సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలకు చెరో 5 సీట్లు, ఎండీఎంకేకు 4, మిగతా సీట్లను చిన్న పార్టీలకు కేటాయించినట్టు ఆయన వివరించారు.



