Thursday, August 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ జూ.కళాశాల స్థలాన్ని ఎవరికీ కేటాయించొద్దు

ప్రభుత్వ జూ.కళాశాల స్థలాన్ని ఎవరికీ కేటాయించొద్దు

- Advertisement -

రెడ్ క్రాస్ సంస్థకు మరోచోట స్థలం కేటాయించాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్
నవతెలంగాణ – భువనగిరి
: విద్యార్థులకు విద్యకు క్రీడలకు ఉపయోగపడే ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలము కాకుండా రెడ్ క్రాస్ సంస్థకు మరోచోట ప్రభుత్వము స్థలము కేటాయించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణను ఆయన పరిశీలించారు. భువనగిరి రెడ్ క్రాస్ సంస్థ వారు కళాశాల స్థలం కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటికే జూనియర్ కళాశాల స్థలం కొంత అన్యాక్రాంతం అయినదని ఇప్పుడు భువనగిరి రెడ్ క్రాస్ సంస్థ వారు కళాశాల స్థలం ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నట్లుగా తెలిసినదని మేము మా పార్టీ అభ్యంతరం తెలియపరుస్తున్నట్లు తెలిపారు. విశాలమైన ఈ స్థలంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా కళాశాలలు క్రీడా నిర్మాణాలు చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ ఒక్క స్థలమే ఉందని పేర్కొన్నారు.

రెడ్ క్రాస్ సంస్థకు దినచర్యలు చాలా ఉంటాయని సందడి నెలకొని ఉంటుందన్నారు. స్థలము ఎవరికి కేటాయించవద్దని ప్రిన్సిపాల్ పాపిరెడ్డి ని కోరారు. రెడ్ క్రాస్ సంస్థకు స్థలం ఇచ్చే విషయాన్ని కలెక్టర్ పరిశీలించి ఇతర చోట ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. విద్యార్థులు యువజన సంఘాలు కళాశాల స్థలం అన్యకాంతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని  విద్యాభివృద్ధికి కేటాయించిన స్థలాన్ని ఇతరులకు కేటాయించకుండా కలిసి వచ్చే పార్టీలతో నిరసన పోరాటాలు చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో  సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ సిపిఐ భువనగిరి మండల పట్టణ కార్యదర్శులు దాసరి లక్ష్మయ్య పుట్ట రమేష్  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -