Saturday, March 21, 2026
E-PAPER
Homeజాతీయంనీటి ఏనుగు దాడిలో వైద్యురాలు మృతి..

నీటి ఏనుగు దాడిలో వైద్యురాలు మృతి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నీటి ఏనుగు (హిప్పోపొటమస్) దాడి చేయడంతో ఓ పశు వైద్యురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. శివమొగ్గ సమీపంలోని త్యావరకొప్ప టైగర్, లయన్ సఫారీలో బెంగళూరుకు చెందిన సమీక్షారెడ్డి (27) ఒప్పంద పద్ధతిలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. సన్ కాపర్ పక్షికి చికిత్స చేసేందుకు గురువారం రాత్రి సఫారీలోని పశు వైద్యశాలకు వెళ్లారు. ఈ క్రమంలో ఆ నీటి ఏనుగు ఆమెపై దాడి చేసింది. అనంతరం సమీక్షాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -