- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
కట్టంగూరు మండల కేంద్రానికి చెందిన ఇల్లెందుల సంతోష్ కు ఫార్మా రంగంలో చేసిన పరిశోధనకు డాక్టరేట్ దక్కింది. జైపూర్ లోని శ్యామ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ శైలేష్ శర్మ పర్యవేక్షణలో వైరస్, క్యాన్సర్ నిరోధక ఔషధాల నిర్ధారణ పై చేసిన పరిశోధనలకు గాను సంతోష్ కు డాక్టర్ లభించింది. ఈ మేరకు యూనివర్సిటీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. సంతోష్ ప్రస్తుతం హైదరాబాదులోని ప్రముఖ ఫార్మసీలో కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సంతోష్ కు డాక్టరేట్ రావడం పట్ల కళాశాల యాజమాన్యం, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -