Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామాజిక సేవకై నేరెళ్లకు డాక్టరేట్ ప్రధానం

సామాజిక సేవకై నేరెళ్లకు డాక్టరేట్ ప్రధానం

- Advertisement -

అభినందించిన మండల ప్రజలు 
నవతెలంగాణ – టేకుమట్ల

బూర్నపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల రామకృష్ణ గౌడ్ సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ ను హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ సిటీ కల్చర్ ఆడిటోరియంలో అందుకున్నారు. రామకృష్ణ గౌడ్ గత రెండు దశాబ్దాల నుంచి వివిధ కుల సంఘాలను ఏకం చేస్తూ, వారి హక్కులను సాధించుకోవడంలో కృషి చేస్తూ, అన్ని సంఘాలను తెలంగాణ ఉద్యమంలో, ఎస్సీ వర్గీకరణలో,  బీసీ రిజర్వేషన్ సాధన ఉద్యమంలో కొనే విధంగా మోటివేషన్ చేయడం, వివిధ కారణాలతో  అనారోగ్యాల పాలై ఆసుపత్రులలో చేరిన నిరుపేదలకు మాజీ స్పీకర్, శాసన మండలి ప్రతిపక్ష నేత సరికొండ మధుసూదనాచారి సహకారంతో  సీఎం రిలీఫ్ ఫండ్స్ గాని, ఎల్ఓసిలు ఇప్పించడం తదితర సామాజిక సేవలు అందించారు.

అదేవిధంగా మృతుల కుటుంబాల పరామర్శలకు, శుభాశుభ కార్యక్రమాలకు నాయకులను పిలిపించి ఆ కుటుంబాలకు భరోసాను కల్పించడం, రైతులకు, కార్మికులకు అవగాహన కల్పించడంతో పాటు, మండలంలో ఏ సమస్య ఉన్న తాను ముందుండి పరిష్కార మార్గం కోసం కృషి చేశారు. సామాజిక కార్యక్రమాలను గుర్తించిన  ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్  స్ఫూర్తి సేవ సొసైటీ ఇండియా వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్  గౌరవ డాక్టరేట్ పురస్కారానికి ఎంపిక చేసి,  హైదరాబాదులో ముఖ్య అతిథులు డాక్టర్ గూడూరు చెన్నారెడ్డి,  డాక్టర్ టీవీ రామకృష్ణ, ఎంఈఓ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్  ఫిలిం ప్రొడ్యూసర్ మల్ల రమేష్, శంషాబాద్ ఎంఈఓ డాక్టర్ ఇస్లావత్ కాసన నాయక్ లు స్ఫూర్తి సేవ సమితి ఆధ్వర్యంలో  రామకృష్ణ గౌడ్ ని సన్మానించి గౌరవ డాక్టరేట్ ని అందించారు. ఒక మారుమూల ప్రాంతం నుంచి తన సేవలను గుర్తించి తనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసిన స్ఫూర్తి సేవా సమితి కి డాక్టర్ రామకృష్ణ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -