బీఆర్ఎస్ జిల్లా నాయకులు డా ర్యాకల శ్రీనివాస్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భూస్వాముల, దొరల అరాచకాల నుంచి విముక్తి కోసం విరచిత పోరాటం చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని బిఆర్ఎస్ జిల్లా నాయకులు, సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామంలో తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య ఆశయాల కోసం యువత కృషి చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం ఆయన పోరాట స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ తొలి సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES