- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిణి స్రవంతి, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఇతర అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, బీసీ కుల సంఘాల నాయకులు వర్ధంతి వేడుకలో పాల్గొన్నారు.
- Advertisement -