Sunday, June 8, 2025
E-PAPER
Homeహెల్త్డీహైడ్రేషన్‌తో సీరం క్రియాటినిన్‌ పెరుగుతుందా?

డీహైడ్రేషన్‌తో సీరం క్రియాటినిన్‌ పెరుగుతుందా?

- Advertisement -

డీహైడ్రేషన్‌ అంటే శరీరంలో ఫ్లూయిడ్‌ కంటెంట్‌ తగ్గడం. ఇది రక్తంలో నీటి కొరతకు దారితీస్తుంది, దీని వలన రక్త శాతం తగ్గుతుంది. శరీరానికి తగినంత నీరు లేకపోతే అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ సమస్యను తక్షణమే గుర్తించి చికిత్స చేయకపోతే, ఇది తీవ్రమైన కిడ్నీ (మూత్రపిండాల) సమస్యలకు దారితీయవచ్చు.

శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు ఈక్రింది లక్షణాలు కనిపిస్తాయి.
– చిరాకు
– తలనొప్పి
– మూత్రం రంగు మారడం (డార్క్‌ ఎల్లోకలర్డ్‌ యూరిన్‌)
– మూత్ర విసర్జన తగ్గడం
– పల్స్‌ రేటు పెరగడం
– రక్తపోటు తగ్గడం
– పొడి చర్మం
డిహైడ్రేషన్‌ వలన కిడ్నీకి కలిగే ప్రభావాలు:
కిడ్నీ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడే ముఖ్యమైన అవయవం. శరీరంలో నీటి కొరత ఉంటే, కిడ్నీ సరిగ్గా పనిచేయదు. ఈ సమస్యను ప్రారంభదశలోనే సరిచేయకపోతే, అది ఆక్యూట్‌ కిడ్నీ ‘ఇంజురీ’కి దారితీయవచ్చు. అంటే రీనల్‌ ఫంక్షన్‌ టెస్ట్‌లో బ్లడ్‌ యూరియా పెరిగిపోవడం, మూత్ర విసర్జన తగ్గడం, మూత్రం రంగు మారడం. ఈ సమస్య మరింత తీవ్రమైతే ఆక్యూట్రీనల్ఫెయిల్యూర్‌ అంటే కిడ్నీ కంప్లీట్‌గా ఫెయిల్‌ అవ్వడం. అందువల్ల రక్తంలో క్రియాటినిన్‌ పెరిగిపోతుంది. ఈ స్థితిలో డయాలసిస్‌ అవసరమవుతుంది.
కొనిసార్లు ఫుడ్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల వాంతులు అవడం, విరేచనాల వల్ల సీవియర్‌గా డీహైడ్రేషన్‌ పెరిగిపోవడం దానితో కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే, రక్తంలో క్రియాటినిన్‌, ఇతర విషపదార్థాలు పెరుగుతాయి.
డీహైడ్రేషన్‌ నుంచి ఎలా తప్పించుకోవాలి?
– రోజుకు 3-4 లీటర్ల నీరు తాగండి.
– వేడి, ఎక్కువ శారీరక శ్రమ ఉన్నప్పుడు ఎక్కువ నీరు తాగండి.
– మూత్రం రంగు, లేత పసుపు రంగులో ఉండేలా చూసుకోండి.
– తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నీరు తాగండి.
– ఎక్కువ వేడి వాతావరణంలో ఉండేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి
– తీవ్రమైన లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి.
ముగింపు
డీహైడ్రేషన్‌ ఒక సామాన్య సమస్య అనుకుని విస్మరించకూడదు. ఇది తీవ్రమైన కిడ్నీ సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి, రోజువారీ జీవితంలో తగినంత నీరు తాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోండి. ”నీళ్లు జీవానికి మూలం, వాటి కొరత జీవనాన్ని క్రమంగా క్షీణింపజేస్తుంది. తాగే ప్రతి గ్లాసునీరు ఆరోగ్యం వైపువేసే అడుగు అని గుర్తించండి.

Dr.Prathusha. Nerella
MD;FID;NLP;CCEBDM;CCGDM
Senior General Physician,
Diabetes&Lifestyle Expert
Ph: 8897684912/040-49950314

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -