- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్ జిల్లా మదన్‌పుర్ గైబువా గ్రామంలో, రైతు రక్షిత్ పాండే తన పెంపుడు శునకం ‘పైలట్’తో కలిసి చెరకుతోటలో కోతలకు వెళ్లారు. అకస్మాత్తుగా దాడి చేసిన పులిని అడ్డుకొని, యజమానిని కాపాడేందుకు ‘పైలట్’ వీరోచితంగా పోరాడింది. ఈ పోరాటంలో తీవ్రంగా గాయపడిన శునకం అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థులు చేరుకునేలోపే పులి పారిపోయింది. శునకం మృతితో యజమాని కన్నీరుమున్నీరయ్యారు.
- Advertisement -



