Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాల డైనింగ్ హాల్‌లోకి కుక్కలు..

పాఠశాల డైనింగ్ హాల్‌లోకి కుక్కలు..

- Advertisement -

సిబ్బంది నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
నవతెలంగాణ – వీర్నపల్లి 

వీర్నపల్లి మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో సిబ్బంది మరియు ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిమ ఫౌండేషన్ నిర్మించిన 400 మంది కూర్చునే సామర్థ్యం గల డైనింగ్ హాలులో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా, కుక్కలు వారి మధ్యలో సంచరించాయి. ఆ కుక్కలు విద్యార్థుల ప్లేట్లలోని అన్నాన్ని తింటుండడంతో, విద్యార్థులు భయంతో భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. కుక్కలు హాలులో తిరుగుతూ, విద్యార్థుల ప్లేట్లలో అన్నం తింటున్నా… మధ్యాహ్న భోజన నిర్వాహకులు, వర్కర్లు, ఉపాధ్యాయులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం విడ్డూరంగా ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. సుప్రీంకోర్టు కుక్కలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా, అధికారులకు పట్టింపు లేదని  తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -