Monday, December 1, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనికొలస్ మదురోకు కాల్ చేసిన డొనాల్డ్ ట్రంప్

నికొలస్ మదురోకు కాల్ చేసిన డొనాల్డ్ ట్రంప్

- Advertisement -


న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: సెప్టెంబర్ నుంచి వెనిజులా నుంచి లాటిన్ అమెరికాలోని ఇతర ప్రాంతాలకు మాదకద్రవ్యాల సాకుతో ఆదేశ‌ పడవలను లక్ష్యంగా చేసుకుని సముద్రంలో అమెరికా దాడులు చేస్తోంది. దీంతో ఇరు దేశాల మ‌ధ్య‌ ఉద్రిక్త‌త వాతావార‌ణం నెల‌కొన్న విషయం తెలిసిందే. తాజాగా రెండు దేశాల మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చేసుకుంది. యూఎస్ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్య‌క్షుడు నికొలస్ మదురో తో ఫోన్లో మాట్లాడారు. కాకపోతే ఆ వివరాలు చెప్పలేనని ట్రంప్ పేర్కొన్నారు.

వెనిజులా రాజధాని కారకాస్‌పై ఒత్తిడిని పెంచుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సైనిక కార్యకలాపాలు అతి త్వరలోనే వెనిజులాలో ప్రారంభమవుతాయని ట్రంప్ హెచ్చరించారు. వెనిజులా వైమానిక ప్రాంతాన్ని పూర్తిగా మూసివేతకు ట్రంప్ ఆదేశించారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ గెరాల్డ్, మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్ ఆఫ్‌పోర్ తీరంలో మోహరించినట్లు తెలుస్తోంది. అయితే అమెరికా చర్యలను మదురో ఖండించారు. దురాక్రమణగా అభివర్ణించారు. వెనిజులా చమురు నిల్వలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -