- Advertisement -
నవతెలంగాణ – కోహెడ
మండలంలోని కూరెళ్ళ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గురువారం మాజీ వార్డు సభ్యుడు గాజుల రవీందర్ రూ.10 వేల విరాళాన్ని గ్రామ పోలీస్ అధికారి, హెడ్ కానిస్టేబుల్ మీట్యాకు అందజేశారు. ఈ సందర్భంగా మీట్యా మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపులోకి వస్తాయన్నారు. ప్రతి ఒక్కరు గ్రామ రక్షణలో భాగంగా విరాళాన్ని అందజేసి సహాకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాగిరి రాజు, ఈగ రాజ్‌కుమార్, బండారి రమేష్, తోట రాజు, చిట్టెంపల్లి రమేష్, చిట్యాల రాజమల్లు, కత్తి చిరంజీవి, మార్గం అజయ్, పంగ మల్లికార్జున్, జాగిర శ్రీనివాస్, జాగిరి రాజశేఖర్, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -