కేంద్రంలోని బీజేపీ… రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల పని తీరు దొందు… దొందే అన్నట్టుంది. మోడీ సర్కార్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రాష్ట్ర సర్కార్ బహిరంగంగా వ్యతిరేకిస్తూనే గుట్టుచప్పుడు కాకుండా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అదానీ, అంబానీ లాంటి బడా బాబులకు మేలు చేసేందుకు 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్‌గా మార్చేందుకు కేంద్రం గత రెండేండ్లుగా ప్రయత్నిస్తోంది. మోడీ కుట్రను కార్మిక సంఘాలు అడుగడుగునా అడ్డుకుంటూనే ఉన్నాయి. కార్మికులకు మరణశాసనం లిఖించే నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈనెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించబోతున్న తరుణంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి వత్తాసు పలుకుతూ నిర్ణయం తీసుకుంది. వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని రోజుకు పది గంటల వరకు పెంచుతూ తెంగాణ ప్రభుత్వం తాజాగా అనుమతించింది. ఆరు గంటల్లో అరగంట విశ్రాంతితో కలిపి రోజుకు 12 గంటల వరకు కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా పనివేళలు సవరించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం అయిన ఐఎన్‌టీయూసీ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొం టుంటే…అ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కార్మికుల హక్కులకు తూట్లు పొడిచే నిర్ణయాలు చకచకా జరిగి పోతున్నాయి. కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించే విషయంలో మోడీ, రేవంత్ సర్కార్లు…’నువ్వు కొట్టినట్టు చెయ్యి.. నేను తిట్టినట్టు నటిస్తా’అన్నట్టు ఒకరి అడుగుల్లో మరొకరు అడుగులేసుకుంటూ నడుస్తున్నారు.
– ఊరగొండ మల్లేశం
దొందు.. దొందే!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES