- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో గల హనుమాన్ మందిర పునర్నిర్మాణానికి రూ.51 వేల విరాళంగా అందజేసిన సంతోష్ మేస్త్రికి ఆలయ కమిటీ సభ్యులు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ .. ఆలయాల అభివృద్ధికి సంతోష్ మేస్త్రి అందించే సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామంలో ఆలయాల నిర్మాణాలకు అన్నదాన కార్యక్రమాలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా వెన్నంటూ ముందుకు వచ్చి భారీ మొత్తంలో విరాళాలు అందజేయడం గ్రామ అభివృద్ధికి ఆయన చేసే సహకారం గ్రామ ప్రజలంతా అభినందిస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో గంగారం సాయిలు, సంఘయప్ప డాక్టర్ రమణ గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



