- Advertisement -
మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
అధైర్య పడకండి అండగా ఉంటానని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎంపీపీ కుటుంబానికి మనోధైర్యాన్ని నింపారు. ఇటీవలే మాజీ ఎంపీపీ పడిగల మానస, బిఆర్ఎస్ నాయకులు పడగల రాజు చిన్న తమ్ముడు మృతిచెందగా మంగళవారం వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మృతుని ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. వారి పిల్లలను బాగా చదివించాలని, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
- Advertisement -