Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళారులకు అమ్ముకొని మోసపోవద్దు..

దళారులకు అమ్ముకొని మోసపోవద్దు..

- Advertisement -

ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు
నవతెలంగాణ – మద్నూర్

సోయా పంట రైతులు తమ పంటను దళారులకు అనుకొని మోసపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర కేంద్రాల్లోనే అమ్ముకొని మద్దతు ధరను సద్వినియోగం పరుచుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సోయా పంచ రైతులను కోరారు. ఆయన బుధవారం సోయా కొనుగోలు కేంద్రాన్ని మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సింగిల్ విండో ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ రాంపటేల్ సొసైటీ సెక్రెటరీ బాబు పటేల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వామి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిలు మార్కెట్ కమిటీ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోయా పంట రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సోయా పంట మద్దతు ధర క్వింటాలు రూ.5,328/-  ప్రభుత్వం  ప్రకటించిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -