Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆ సెలవుల ఉపాధ్యాయుడు మాకొద్దు.!

ఆ సెలవుల ఉపాధ్యాయుడు మాకొద్దు.!

- Advertisement -

28 నెలలుగా విధులకు డుమ్మా కొడుతున్న వైనం
చూసిచూడనట్లుగా విద్యాశాఖ అధికారులు
ఆందోళనలో విద్యార్థులు,తల్లిదండ్రులు
కలెక్టర్ గారు పట్టించుకొండి
నవతెలంగాణ-మల్హర్ రావు:
28 నెలలుగా విధులకు డుమ్మా కొడుతూ ప్రభుత్వ సెలవుల రోజుల్లో మాత్రమే ప్రభుత్వం నుంచి వేతనం పొందుతూ విద్య వ్యవస్థను తప్పుతోవ పట్టిస్తున్న ఓ ఉపాధ్యాయుని బాగోతం సోమవారం ఆలస్యంగా బట్టబయలైంది.విద్యార్థుల,స్థానికుల పూర్తి కథనం ప్రకారం మండలం పెద్దతూoడ్ల గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న పిన్నింటి వేంకటేశ్వర రావు అనే ఉపాధ్యాయుడు గత 28 నెలలుగా ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో మాత్రమే వేతనం పొందుతూ పాఠశాల వర్కింగ్ రోజుల్లో విధులకు డుమ్మా కొడుతూ విద్యాశాఖ వ్యవస్థకు మచ్చ తెచ్చాడు.ఈ డుమ్మా ఉపాధ్యాయునిపై స్థానిక విద్యాశాఖ వదికారులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోయిన చర్యలు తీసుకోవాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరించడం గమనార్హం.డుమ్మా ఉపాధ్యాయుడు నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులకు అమ్యామ్యాలు అందడంతోనే ఉపాధ్యాయుడికి కొమ్ము కాస్తున్నట్టుగా తెలుస్తోంది.ఎప్పుడు విధులకు డుమ్మా కొడుతూ కనీసం ఓనమాలు నేర్పని ఆ డుమ్మా ఉపాధ్యాయుడు మాకొద్దని విద్యార్థులు సోమవారం పాఠశాలలో ఆందోళన చేశారు.ఈ డుమ్మా టీచర్ పై తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు గతంలో పలుమార్లు జెడ్పి సమావేశంలో ప్రశ్నించిన అప్పుడున్న జిల్లా విద్యాశాఖ అధికారి అతన్ని సస్పెన్షన్ చేశామని ప్రగల్బాలు పలుకుతూ తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఇటీవల నవ తెలంగాణ దినపత్రికలో డుమ్మా టీచర్లకు చెక్ పడేనా అనే కథనం ప్రచురించిన విషయం తెలిసిందే ఉపాధ్యాయులు సమయ పాలన పాటించేలా ,,పిజిషియల్ రికగ్నిషన్,, తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైoది.

డుమ్మా ఉపాధ్యాయుడు గైహాజరైన విధానం ఇలా….
ప్రభుత్వం చేపట్టిన మ్యాచువల్ ట్రాన్స్ పార్మర్ లో భాగంగా పెద్దతూoడ్ల హైస్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడుగా మొదటి జాయిన్ అయ్యాడు. ఏప్రిల్ నెల వేసవి సెలవులు తరువాత పాఠశాలలు పున:ప్రారంభం తరువాతి జులై 21, 2022 జాయినింగ్, సెప్టెంబర్ 24,2022 రిజాయినింగ్,దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 20,2022 రిజాయినింగ్, ఏప్రిల్ 24,2023 మళ్ళీ జాయినింగ్, జూన్ 12,2023 రిజాయినింగ్,జూన్ 13,2024 జాయినింగ్ ఇలా 28 నెలలుగా విధులకు డుమ్మా కొడుతూ సెలవుల్లో మాత్రమే టీచర్ గా చేస్తున్నారు.ఇన్ని డుమ్మాలు కొట్టిన ఈయన స్థానంలో వేకెన్సీ చూపకపోవడం మరో విశేషం.దాదాపు మూడేళ్ళుగా వేకెన్సీ చూపకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.విద్యార్థులకు న్యాయం జరగాలంటే జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకొని పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ నియమించాలని విద్యార్థులతల్లిదండ్రులు కోరుతున్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -