Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యుద్ధాల పేరుతో ప్రజలపై భారాలు మోపొద్దు..

యుద్ధాల పేరుతో ప్రజలపై భారాలు మోపొద్దు..

- Advertisement -

సిపిఐ జిల్లా సమితి సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
యుద్ధాల పేరుతో ప్రజలపై ఆర్థిక భారాలు మోపే విధానాలను నిలిపివేసి ప్రజలందరికీ వంటగ్యాస్ అందుబాటులో ఉండేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం చౌటుప్పల్ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని కోరారు. యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుందని, అనేక దేశాల్లో పేదలకు వంటగ్యాస్ అందుబాటులో లేకుండా పోతుందని అన్నారు.

అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇరాన్‌లో అణు ఆయుధాలు తయారు చేస్తున్నారనే ఆరోపణలతో ఆ దేశంపై దాడులు చేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. ఈ దాడుల్లో పాఠశాలలు, ఆస్పత్రులపై బాంబులు వేయడం వల్ల పసిపిల్లలు, సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు దేశాల మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేయడం జరిగిందని,దీంతో భారత్ సహా అనేక దేశాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. యుద్ధం కొనసాగితే భారత దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి సహాయ కార్యదర్శి ఉడత రామలింగం నాయకులు బద్దుల సుధాకర్ కొండూరు వెంకటేష్ దాసరి అంజయ్య మనోహర్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -