Wednesday, October 29, 2025
E-PAPER
Homeఖమ్మంపౌస్టికరం, మౌలిక వసతులు విషయంలో రాజీ పడొద్దు.. 

పౌస్టికరం, మౌలిక వసతులు విషయంలో రాజీ పడొద్దు.. 

- Advertisement -

– వసతి గృహమును ఆకస్మిత తనిఖీ చేసిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.. 
నవతెలంగాణ – మణుగూరు: సంక్షేమ హాస్టల్లో సంక్షేమ హాస్టల్ లో పౌష్టికాహారం పౌష్టికాహారం వసతులు కల్పనలో రాజీ పడొద్దు అని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు బుధవారం మణుగూరు మండలం అశోక్ నగర్ లో గల గిరిజన బాలుర వసతి గృహమును ఆకస్మితంగా తనిఖీ  చేశారు. విద్యార్థులకు అమలు చేస్తున్న భోజన మెనూ గురించి ఆరా తీశారు. హాస్టల్‌ పరిసర ప్రాంతాలు, సౌకర్యాల గురించి స్వయంగా విద్యార్థులతో మాట్లాడి ఆరా తీశారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, కావాల్సిన ఇతర మౌళిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఆహారాన్ని పరిశీలించారు. స్వయంగా తరగతి గదులకి, విశ్రాంతి గదులను, వంటశాల,స్టోర్ రూములకు వెళ్లి పరిశీలించారు.

వసతి గృహాల్లో చేరిన విద్యార్థుల సంఖ్యను ధ్రువీకరించి, ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు కల్పించే వసతి సౌకర్యాలను  హాస్టల్ సిబ్బంది తెలిపారు. విద్యార్థులతో  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్ చార్జెస్ పెంచడం జరిగింది అని తెలుపుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నతమైన విద్య, పౌష్టిక ఆహారం, వసతులు విషయంలో రాజీ పడకుండా నిధులను మంజూరు చేస్తుందని విద్యార్థులందరూ శ్రద్ధగా చదువుకొని  ఉన్నతమైన స్థానాలను అవరోహించాలి అని  ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మహిళా నాయకురాలు మానస  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -