Sunday, December 21, 2025
E-PAPER
Homeహెల్త్ఏడుపు కాదు... ఎదుర్కోవడం నేర్చుకోవాలి

ఏడుపు కాదు… ఎదుర్కోవడం నేర్చుకోవాలి

- Advertisement -

ఇప్పటి పిల్లల ప్రవర్తనలో ఒక కొత్త మార్పు బలంగా కనిపిస్తోంది. ఏదైనా వస్తువు, బొమ్మ, ఫోన్‌, ఫుడ్‌ లేదా చిన్న కోరిక కూడా వెంటనే తీరకపోతే, చాలా మంది పిల్లలు:
నేల మీద పడిపోవడం గట్టిగా అరవడం కాళ్లు చేతులు కొట్టడం శ్వాస వేగంగా తీసుకోవడం ‘నాకు ఇప్పుడే కావాలి’ అని కేకలు పెట్టడం
ఇలాంటి ప్రవర్తనలను చాలా తల్లిదండ్రులు ‘చిన్న వయసు’ అని అనుకుంటారు. దీర్ఘకాలం ఇలా కొనసాగితే, ఇది చిన్నపాటి Panic Attack Response
Pattern గా మారుతుంది.

ఈ సమస్య ఎందుకు పెరుగుతోంది?
1. వెంటనే అందే కాలం :
నేటి జీవనశైలి పిల్లలను వేచిచూడనివ్వడం లేదు. వీడియో వెంటనే ప్లే కావాలి,ఆర్డర్‌ చేస్తే వెంటనే రావాలి,అడిగినది వెంటనే దొరకాలి, ”వేచిచూడటం” అనే భావన పిల్లల మనసులో దాదాపు లేనట్టే. అందుకే ఆలస్యం జరిగితే ప్రస్టేషన్‌ అవడమో, పానిక్‌ అవడమో జరుగుతోంది

2. అతి ప్రేమ (ఓవర్‌ ప్రొటెక్షన్‌) : చిన్న పని కూడా పిల్లతో చేయనివ్వకుండా, తల్లిదండ్రులే ముందుకు వచ్చి చేస్తారు.’సైకిల్‌ తొక్కితే పడిపోతాడు’, ”ఒంటరిగా వెళ్లనివ్వడం బాగుండదు”, ”ఇప్పుడు టాస్క్‌ పెద్దది కాబట్టి నేను చేస్తాను”… ఇలాంటి రక్షణ భావన పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని తగ్గిస్తుంది, ఏ అసౌకర్యమైనా అసాధారణ ప్రమాదంలాగా మెదడు గ్రహిస్తుంది.

3. ‘నో’ అనే పదానికి అలవాటు లేకపోవడం : తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తున్నప్పుడు వెంటనే కొని ఇస్తే ఆ పిల్లవాడు అక్కడే ఆగిపోతాడు. తీసుకో అంటూ కోరిక తీరుస్తారు. అలా రిపీటెడ్‌గా జరిగితే పిల్లలు నేర్చుకునేది ”నేను ఏడ్చితే, నేను పానిక్‌ అయ్యితే నాకు అన్నీ దొరుకుతాయి”

పానిక్‌ అటాక్‌ పిల్లల్లో ఎలా కనిపిస్తుంది?
శ్వాస వేగం, గాలి త్వరగా పీల్చడం, చేతులు వణుకు, కంట్రోల్‌ లేకపోవడం, గుండె వేగం, టెన్షన్‌, భయం, ఏమి అనాలో తెలియకపోవడం, కళ్ళు తిరిగినట్టుగా, helpless feeling.. ఇది acting కాదు. నిజంగా మెదడుకి అలవాటుగా మారుతుంది.

దీని భవిష్యత్‌ ప్రభావం ఏమిటి?
ఇలా పెరిగిన పిల్లలు కాలేజీ, ఉద్యోగం, సంబంధాలలో రిజెక్షన్‌, వెయిటింగ్‌, కష్టం, నియంత్రణ, ఏవీ హ్యాండిల్‌ చేయలేరు.
ఫలితంగా కోపం, డిప్రెషన్‌, ఆత్మ విశ్వాసం లేకపోవడం. భావోద్వేగ అస్థిరత.
పిల్లలను మార్చడానికి తల్లిదండ్రుల కోసం సూచనలు

1. వెంటనే ఇవ్వడం తగ్గించండి. అడిగిన వెంటనే ఇవ్వడం ఆపండి.
మొదట 2 నిమిషాలు, తరువాత 5 నిమిషాలు, తరువాత 10 నిమిషాలు.. ఇది సహనం సహనం ప్రాక్టీస్‌ చేయడమే.
2. ‘నో’ చెప్పడాన్ని నేర్చుకోండి కానీ కోపంగా కాదు, కామ్‌గా.
ఉదాహరణ: ఇది ఇప్పుడు సాధ్యం కాదు. తరువాత చూసుకుందాం.”

3. అనుభవించనివ్వండి.
పడి పోయినా, తప్పు చేసినా, ఫెయిల్‌ అయినా ఇది అభ్యాస ప్రక్రియ. వారి జీవితం సులభం చేయడం కాదు.వారు జీవితాన్ని హాండిల్‌ చేయడం నేర్పించాలి.
4. స్క్రీన్‌ టైమ్‌కి డిసిప్లిన్‌ పెట్టండి
ఎక్కువ స్క్రీన్‌ + తక్కువ సహనం = డోపమైన్‌ వ్యసనం.
5. పానిక్‌ సమయంలో మీరు బాధ పడకండి? తల్లి దండ్రుల calmness,, పిల్లల regulation..
పిల్లల కోసం మార్చుకోవాల్సిన చిన్న అలవాట్లు
కోపం వచ్చినప్పుడు 3 సార్లు గట్టిగా గాలి పిల్చి వదలండి. శ్వాస నియంత్రణ bతీaఱఅ brain calm mode activate చేస్తుంది.
1 నుండి 10 వరకు నెంబర్లను లెక్క పెట్టడం. ఇది ఉద్వేగ ప్రతిచర్యను తగ్గస్తుంది.
”నేను షaశ్రీఎ అయ్యాక మాట్లాడుతాను” వాక్యం ప్రాక్టీస్‌
ఇది (emotional maturity) భావోద్వేగ పరిపక్వతని పెంచుతుంది.
➡ ªWait Game
రోజూ 30 సెకండ్ల patience practice తరువాత 1 నిమిషం తరువాత 3 నిమిషాలు.
ఫెయిల్‌ అయినా పట్టించుకోకుండా ‘Try Againμμ mindset Success కంటే పట్టుదల ముఖ్యమని నేర్పిస్తుంది.
ఈ తరం పిల్లలు తెలివిగా, స్మార్ట్‌గా, డిజిటల్‌గా ముందున్నారు.
కానీ భావోద్వేగం, సహనం, ఆత్మస్థైర్యంలో వెనుకపడుతున్నారు.
తల్లిదండ్రులుగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే లైన్‌:
”పిల్లలను ఏడ్చే జీవితం కాకుండా,
ఎదుర్కొని నిలబడేలా తీర్చిదిద్దాలి.”

డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031 కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -