Monday, December 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆ కార్మిక చ‌ట్టాల‌ను అమ‌లు చేయొద్దు: టిడబ్ల్యూజేఎఫ్

ఆ కార్మిక చ‌ట్టాల‌ను అమ‌లు చేయొద్దు: టిడబ్ల్యూజేఎఫ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను అమలు చేయవద్దని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు బి రాజశేఖర్, గుడిగ రఘు, పి రాధిక, స్టేట్ ఈసీ మెంబర్ మణిమాల, నాయకులు మేకల కృష్ణ తదితరులు సోమవారం హైదరాబాద్‌లో కార్మిక ఉపాధి కల్పన శాఖా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిను కలిశారు. లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని టీడబ్ల్యు జెఎఫ్ నాయకులు మంత్రిని కోరారు. జర్నలిస్ట్ యాక్సిడెంట్ పాలసీని పునరుద్ధరించాలని, త్రైపాక్షిక కమిటీ నియమించాలని, కమిటీ లో HUJ కి ప్రాతినిధ్యం ఇవ్వాలని, కనీస వేతనాల జీవో సవరించాలని, రాత్రి వేళ మహిళా జర్నలిస్టులకు ప్రయాణ సౌకర్యం కల్పించాలనీ కోరారు. ఈమేరకు టి డబ్ల్యు జె ఎఫ్ బృందం మంత్రికి వినతిపత్రం అందజేసింది.

మంత్రి స్పందిస్తూ, త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్మిక శాఖ పరిధిలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వివేక్ టిడబ్ల్యూజేఎఫ్ బృందానికి హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -