మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలన్నీ పుష్కలంగా ఉండాలి. పోషకాలు ఎక్కువగా ఉంటేనే మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. అలాంటి పోషకాల్లో అత్యంత ముఖ్యమైనది జింక్. ఈ జింక్ మూలకం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సరైన విధానంలో జీవించేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యంగా పిల్లల పెరుగుదలలో, పెద్దల్లో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపయోగపడతాయి. కానీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే జింక్ లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? జింక్ ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం.
చర్మ సమస్యలు: తరచూ దద్దుర్లు, చర్మం పొడిబారడం, చర్మంపై చిన్న గాయాలు రావడం
జుట్టు సమస్యలు: జుట్టు బలహీనంగా మారి, వేగంగా రాలిపోవడం.
గోళ్లు పీలిపోవడం: గోళ్లు విరిగిపోవడం లేదా ముడుచుకు పోవడం.
జీర్ణ సమస్యలు: పేగుల పని తీరులో మార్పులు, విరేచనాలు
జింక్ లోపం ఎఫెక్ట్ ఎంత ఉంటుంది?
వైద్య నిపుణుల ప్రకారం, జింక్ లోపం ఉన్నవారికి రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. శరీరం సులభంగా ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. చిన్న గాయాలైనా మానడానికి సమయం పడుతుంది. పిల్లల్లో ఇది పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది. అలాగే పెద్దలలో హార్మోన్ల అసమతుల్యతను భంగం కలిగిస్తుంది. ఇది సంతాన సంబంధిత సమస్యలకూ కారణమవుతుంది.
జింక్ అధికంగా ఉండే ఆహారాలు
శరీరానికి అవసరమైన జింక్‌ను సహజంగా ఆహార ద్వారానే పొందవచ్చు. అందులో ముఖ్యమైనవి:
మాంసాహార పదార్థాలు: చికెన్, మటన్, చేపలు – వీటిలో జింక్ మోతాదులో ఉంటుంది. వారానికి 2-3 సార్లు తినడం మంచిది. పాల పదార్థాలు: పాలు, పెరుగు, చీజ్ లాంటి డెయిరీ ఉత్పత్తులు. గుడ్లు: ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల జింక్ అవసరం తీరుతుంది. గింజలు: గుమ్మడికాయ గింజలు, శెనగలు, బఠానీలు – ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తూ, జింక్‌ను సమద్ధిగా అందిస్తాయి. తణధాన్యాలు: జొన్న, రాగి, గోధుమ వంటి చిరుధాన్యాలు జింక్‌ను సహజంగా అందిస్తాయి.
నిర్లక్ష్యం చేయొద్దు?
- Advertisement -
- Advertisement -