నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచదేశాలపై ప్రతీకార సుంకాలతో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ దాడి చేస్తున్న విషయం తెలిసిందే. రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తుందని భారత్ పై అదనపు సుంకాలు విధించారు. తాజాగా మరోసారి ఇండియాపై ట్రంప్ అక్కసును వెళ్లగక్కారు. గురువారం వైట్‌హౌస్ వేదికగా టెక్ సీఈవోలకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందు సందర్భంగా భారత్‌లో పెట్టుబడులు ఆపి.. స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆపిల్ సీఈవోతో ట్రంప్ సంభాషించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ సీఈవోలతో ట్రంప్ సంభాషిస్తూ ఇతర దేశాల్లో పెట్టుబడులు ఆపి యూఎస్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం ఏ మాత్రం తనకు ఇష్టం లేదని, అమెరికాలో బాగా చూసుకుంటామని.. ఇకపై భారత్‌లో పెట్టుబడులు పెట్టొద్దని ట్రంప్ సూచించారు.
భారత్‌లో పెట్టుబడులు పెట్టొద్దు: ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES